అక్టోబరు 28, 29వ తేదీలో హైదరాబాదులో స్వామివారి కల్యాణాలు

అక్టోబరు 28, 29వ తేదీలో హైదరాబాదులో స్వామివారి కల్యాణాలు

తిరుపతి, 2017 అక్టోబరు 26: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఎన్టీఆర్‌ స్టేడియంలో అక్టోబరు 28వ శ్రీ సీతారాముల కల్యాణం, అక్టోబరు 29వ తేదీ శ్రీవారి కల్యాణాలను సాయంత్రం 6.00 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు.

నవంబరు 8, 11వ తేదీలలో విజయవాడలో……

అదేవిధంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నవంబరు 8వ తేదీ శ్రీసీతారాముల కల్యాణం, నవంబరు 11వ తేదీ శ్రీనివాసకల్యాణం సాయంత్రం 6.00 గంటలకు వైభవంగా జరుగనుంది. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకరరావు ఈ కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.