TRAIMASIKA METLOTSAVAM FROM OCT 28-30_ అక్టోబరు 28 నుండి 30వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

TIrupati, 26 October 2017: The three day Traimasika Metlotsavam will be observed from October 28-30 under the aegis of Dasa Sahitya Project of TTD.

On the first two days there will be Shobha Yatra and Dasa Saneertana with over 3000 dasa devotees in Govindaraja Swamy chowltry while on final day Metla Puja will be performed during the wee hours on October 30 at Alipiri Padala Mandapam.

The Dasa devotees commence trekking the Alipiri footpath route chanting Govinda Namas and Dasa Bhajans.

Dasa Sahitya Project Special Officer Dr PR Anandateerthacharya supervising the arrangements.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అక్టోబరు 28 నుండి 30వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుపతి, 2017 అక్టోబరు 26: తిరుమల తిరుపతి దేవస్థానములు ఆధ్వర్యంలో అక్టోబరు 28 నుండి 30వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల టిటిడి శ్రీగోవిందరాజస్వామి మూడవ సత్ర ప్రాంగణములో ప్రారంభమవుతాయి.

అక్టోబరు 28, 29వ తేదీల్లో ఉదయం 5.00 నుండి 7.00 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటల నుండి 12.00 గంటల వరకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల భజన మండలులతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.00 గంటల నుండి 6.00 గంటల వరకు ధార్మిక సందేశం కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

అక్టోబరు 28వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి మూడవ సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. అక్టోబరు 29వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు కోలార్‌ సమీపంలోని మాధవతీర్థ మఠం శ్రీశ్రీశ్రీ విద్యాసాగర మాధవతీర్థ స్వామీజీ అనుగ్రహభాషణం ఇవ్వనున్నారు. అక్టోబరు 30వ తేదీ సోమవారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపంలో ఉడిపి కాణ్యూర్‌ మఠము శ్రీశ్రీశ్రీ విద్యావల్లభ తీర్థ స్వామిజీ, ఇతర అధికార ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండళ్ల సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.

పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టింది. ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, వారికి సకల అరిష్టములు తొలగి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.