ఫిబ్రవరి 3 నుంచి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు

ఫిబ్రవరి 3 నుంచి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, 2018 ఫిబ్రవరి 01: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు చోట్ల శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

విశాఖలో..

– ఫిబ్రవరి 3న పాడేరు మండలం రాములపుట్టు గ్రామంలో ఉదయం 11 గంటలకు శ్రీవారి కల్యాణం జరుగనుంది.

– ఫిబ్రవరి 4న రోలుగుంట్ల, అంట్లపాళెం ఎస్‌సి కాలనీలో ఉదయం 11 గంటలకు శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– ఫిబ్రవరి 5న చోడవరం మండలం లక్ష్మీపురం ఎస్‌సి కాలనీలో ఉదయం 11 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

– ఫిబ్రవరి 6న అనకాపల్లి మండలం సీతానగర్‌ ఎస్‌సి కాలనీలో ఉదయం 11 గంటలకు శ్రీవారి కల్యాణం జరుగనుంది.

తూర్పుగోదావరిలో..

– ఫిబ్రవరి 7న కె.గంగవరం మండలం పేకేరు గ్రామంలో సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకరరావు ఈ కల్యాణాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.