KUPCHANDRAPETA UTSAVAM HELD_ ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం

Tiruapti, 1 February 2018: The procession of utsava murthies including Sri Kodanda Rama, Sita Devi and Lakshmana Swamy were taken to Kupchandrapeta village on Thursday on the celestial occasion of Magha Pournami.

Snapana Tirumanjanam was performed to deities on this occasion.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం

మాఘపౌర్ణమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం గురువారం నాడు ఘనంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉదయం 6 గంటలకు ఆలయం నుండి బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 9 గంటలకు చేరుకుంది. అక్కడ స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్‌సేవ చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు అక్కడి నుండి బయల్దేరి రాత్రి 9 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి, ఆలయ అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.