ఫిబ్రవరి 4న తిరుపతిలో శ్రీనివాస కల్యాణం

ఫిబ్రవరి 4న తిరుపతిలో శ్రీనివాస కల్యాణం

తిరుపతి, 2018 ఫిబ్రవరి 02: టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం తిరుపతిలోని ఇస్కాన్‌ ఆలయం ఎదురుగా ఉన్న మైదానంలో శ్రీవారి కల్యాణం వైభవంగా జరుగనుంది.

శ్రీవారి కల్యాణోత్సవం ఉదయం 11.00 గంటలకు ప్రారంభమవుతుంది. శ్రీవేంకటేశ్వరస్వామి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.