SRINIVASA KALYANAMS IN TWIN GODAVARI DISTRICTS FROM JUNE 19-29_ జూన్‌ 19 నుంచి 29వ తేదీ వరకు ఉభయ గోదావరి జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు

Tirupati, 17 June 2018: The celestial wedding ceremony, Srinivasa Kalyanam will be performed in twin Godavari Districts from June 19-29.

June 19 in Mamidikuduru, June 20 in Gangalakurru village, June 21 in Dhrmavaram village of Prattipadu mandal, June 22 in Tondagi mandal of East Godavari District.

While in West Godavari, the divine weddings takes place in Pasaladevi Village of Narasapuram on June 26, in Elurupadu village on June 27, Tadiparru village in Undrajavaram mandal on June 28 and Unagatla village in Chagallu mandal on June 29.

In every place the celestial kalyanams will be performed between 6pm and 8pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌ 19 నుంచి 29వ తేదీ వరకు ఉభయ గోదావరి జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, 2018 జూన్‌ 17: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో జూన్‌ 19 నుంచి 30వ తేది వరకు ఉభయగోదావరి జిల్లాలలోని 8 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. అన్నిచోట్లా సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు ప్రారంభంకానున్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలో….

– జూన్‌ 19వ తేదీన మామిడికుదురు మండల కేంద్రంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– జూన్‌ 20న అంబాజిపేట మండలం, గంగలకుర్రు గ్రామంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

– జూన్‌ 21న ప్రత్తిపాడు మండలం, దర్మవరం గ్రామంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– జూన్‌ 22న తొండగి మండల కేంద్రంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో…

– జూన్‌ 26న నరసాపురం మండలం, పసలదేవి గ్రామంలోని శ్రీ రాములవారి ఆలయ ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– జూన్‌ 27న కల్లమండల్‌ మండలం, ఏలూరుపాడు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– జూన్‌ 28న ఉండ్రాజవరం మండలం, తాడిపర్రు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– జూన్‌ 29న చాగల్లు మండలం, ఉనగట్ల గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.