THE CONSECRATION DAY OF BHOGA SRINIVASA MURTHY OBSERVED

Tirumala, 17 June 2018: The temple management of Lord Venkateswara has conducted special Sahasra Kalasabhishekam on Sunday, to commemorate the historical occasion of the gifting of silver idol of Lord, Sri Bhoga Srinivasa Murthy by the Pallava queen Samavai in 614 AD.

Immense sanctity is attached to the idol which is regarded as one among the Pancha Murthies which is also known as ‘Katuka Bera’ in Agamic parlance.

An inscription about the donation can also be found on the walls of the inner-most vimana prakaram of the hill temple.

The special ritual was observed at Bangaru Vakili between 6 a.m. and 8 a.m. after the completion of religious formalities.

HH Tirumala Pedda Jiyangar, Chinna Jiyar Swamy, EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Temple DyEO Sri Harindranath and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా శ్రీభోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం

జూన్‌ 17, తిరుమల, 2018: తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఆదివారం ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం జరిగింది. 12 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకస్వాములు ఏకాంతంగా సహస్రకలశాభిషేకం నిర్వహించారు. మిగతా ఆర్జిత సేవలన్నీ యథావిధిగా జరిగాయి.

చారిత్రక నేపథ్యం :

పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్‌ అని కూడా పిలుస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జెఈఓ శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.