KALYANAM PERFORMED WITH RELIGIOUS FERVOUR_ అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరాలయంలో వైభవంగా కల్యాణోత్సవం
Appalayagunta. 26 June 2018: On the fourth day evening, the celestial wedding of Sri Prasanna Venkateswara Swamy was performed in a colourful manner with religious fervour.
The processional deities of Lord Sri Prasanna Venkateswara was wedded to Sridevi and Bhudevi in a befitting divine marriage as per the Hindu tradition.
Devotees thronged in large numbers to witness the celestial wedding. The ceremony took place between 6pm and 8pm.
GARUDA SEVA ON JUNE 27
Appalayagunta has geared up for the big event during the ongoing annual Brahmotsavams, the Garuda Seva on Wednesday evening.
TTD had made elaborate arrangements in terms of food, water, Security for the devotees who are expected to converge in large numbers under the instructions of Tirupati JEO Sri P Bhaskar and in the supervision of Special Grade DyEO Sri Munirathnam Reddy.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరాలయంలో వైభవంగా కల్యాణోత్సవం
తిరుపతి, 2018 జూన్ 26: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 5.00 నుంచి రాత్రి 7.30 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. పుణ్యహవచనం, పవిత్రహోమం, కంకణధారణ, మాంగళ్యధారణ, మంగళాశాసనం ఘట్టాలతో సంప్రదాయబద్ధంగా శ్రీవారి కల్యాణం జరిగింది. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేశారు.
జూన్ 27న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గరుడసేవ
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరుగనుంది. రాత్రి 8.30 గంటల నుండి 10.30 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణా, కంకణభట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, ఎవిఎస్వో శ్రీ పార్థసారధిరెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.