KANUMA GOPUJA AT SV GOSHALA ON JANUARY 16 _ జనవరి 16న ఎస్వీ గోశాలలో కనుమ గోపూజ
Tirupati, 09 January 2024: TTD is making full arrangements for conducting the Gopuja on January 16 at SV Goshala in Tirupati as part of the Sankranthi Kanuma festivities.
On the occasion, special pujas like Gajapuja, Aswapuja, Vrishaba puja, Tulasi puja, Gobbemma fete and Sri Venugopal Swamy Harati will be performed at Sri Venugopal Swamy Sannidhi.
Thereafter cultural events will also be held.
Later Prasadams will be distributed to devotees along with Darshanam of Sri Venugopala Swamy.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 16న ఎస్వీ గోశాలలో కనుమ గోపూజ
తిరుపతి, 2024 జనవరి 09: సంక్రాంతి కనుమ పండుగను పురస్కరించుకుని జనవరి 16వ తేదీ మంగళవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోపూజ ఘనంగా జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, శ్రీ వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహిస్తారు. అనంతరం హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి హరిదాసులు, బసవన్నల నృత్య కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుండి శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.