శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా ఆరుద్ర దర్శన మహోత్సవం

శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా ఆరుద్ర దర్శన మహోత్సవం

తిరుపతి, 2018 జనవరి 02: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం ఆరుద్ర దర్శన మహోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా తెల్లవారుజామున 2.00 నుండి 4.00 గంటల వరకు మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. ధనుర్మాస నైవేద్యం సమర్పించిన అనంతరం ఉదయం 5.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ శివగామి సమేత నటరాజ స్వామివారు, శ్రీ మాణిక్యవాసగర్‌ స్వామివార్లను పురవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం శాస్త్రోక్తంగా దీపారాధన చేపట్టారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ శంకర్‌రాజు, ఇతర ఆలయ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.