VINAYAKA CHAVITHI IN SRI KAPILATEERTHAM ON SEPTEMBER 13_ సెప్టెంబరు 7న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

Tirupati, 28 August 2018: Special abhishekam and puja will be performed in connection with Vinayaka Chavithi at Sri Kapileswawa Swamy temple in Tirupati on September 13.

In the evening Lord Ganesha will be taken on a celestial ride on Moushika Vahanam.

While on September 7 Laksha Kumkumarchana will be performed in the temple to Kamakshi Ammavaru. Grihastas can participate in this fete on payment of Rs.200 per ticket on which two persons will be allowed.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 7న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

తిరుపతి, 2018 ఆగస్టు 28: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారికి సెప్టెంబరు 7వ తేదీన లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఉదయం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, సంకల్పంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి విడత కుంకుమార్చన నిర్వహిస్తారు. ఆ తరువాత నైవేద్యం, హారతి ఉంటుంది. తిరిగి సాయంత్రం 4.00 నుంచి 6.00 గంటల వరకు రెండో విడత కుంకుమార్చన జరుగనుంది. అనంతరం నివేదన, దీపారాధన, హారతి, తీర్థప్రసాద వినియోగం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగిస్తారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక లడ్డూ, కుంకుమ ప్రసాదం బహుమానంగా అందజేశారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 13వ తేదీ శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి

శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 13వ తేదీ వినాయక చవితి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయ.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ వినాయకస్వామివారు మూషికవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.