KEELAPATLA PAVITROTSAVAMS_ సెప్టెంబరు 5 నుండి 7వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Tirupati, 28 August 2018: The annual Pavitrotsavams in Sri Konetiraya Swamy temple at Keelapatla will be observed from September 5 to 7 at Palamaneru.

Ankurarpanam for the fete will be performed on September 4.

On first day there will be Raksha Bandhanam, on 6th Snapana Thirumanjanam will be performed followed by Pavitra Samarpana and on final day on September 6 Purnahuti will be observed.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 5 నుండి 7వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2018 ఆగస్టు 28: టిటిడి అనుబంధ ఆలయమైన శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 5 నుండి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 4న సాయంత్రం పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయ.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సెప్టెంబరు 5వ తేదీ రక్షబంధనం, పవిత్రప్రతిష్ఠ, శేషాధివాసం నిర్వహిస్తారు. సెప్టెంబరు 6వ తేదీ ఉదయం స్నపనతిరుమంజనం, పవిత్ర సమర్పణ, సాయంత్రం పవిత్ర హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 7న హోమాలు, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.