KAPILESWARA SWAMY BLESS DEVOTEES ON NANDI VAHANAM _ నంది వాహనంపై శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి అభయం

Tirupati, 08 March 2024: On the eighth day of Sri Kapileswara Swamy Brahmotsavam, on Friday night on the auspicious occasion of Maha Sivaratri, Sri Kapileswara Swamy along with Sri Kamakshi Devi took shelter on Nandi Vahanam. 

Vahanaseva took place in the city streets in the midst of bhajan mandal kolatams, bhajans and mangal instruments.  

Nandi Vahanam is special for Parameswara as Garuda Vahana is dear to Lord Vishnu.

Temple Deputy EO Sri Devendra Babu, VGO Sri Bali Reddy, AEO Shri Subbaraju, Superintendent Sri Bhupathi, Temple Inspectors Sri Ravikumar, Sri Balakrishna and devotees participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

నంది వాహనంపై శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి అభయం

తిరుప‌తి, 2024, మార్చి 08: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారు నంది వాహనంపై అభయమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై తిరుపతి పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

మ‌హావిష్ణువుకు గరుడ వాహనం ఎంత ప్రీతికరమైనదో పరమేశ్వరునికి నంది వాహనం అంత విశిష్టమైనది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.