SRI KALYANA VENKATESWARA SWAMY BRAHMOTSAVAM CONCLUDES _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Tirupati, 08 March 2024: The nine-day annual Brahmotsavam at Sri Kalyana Venkateswara Swamy Temple in Srinivasa Mangapuram concluded with Dhwajavarohanam on Friday evening.

All the deities who had been invited on the flag-raising ceremony were bid adieu after deposing the Garuda flag in a ceremonious way.

JEO Sri Veerabraham, Temple Special Grade Deputy EO Smt Varalakshmi, AEO Sri Gopinath, Advisor of Vaikhanasa Agama Sri Mohana Rangacharyulu, Superintendent Sri Chengalrayu, Temple Priests Balaji Rangacharyulu, Temple Inspector Shri Kiran Kumar Reddy participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 మార్చి 08: శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం సాయంత్రం ధ్వజావరోహణంతో ముగిశాయి.

సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చకులు బాలాజి రంగ‌చార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.