KAPILESWARA SWAMY BTUs POSTERS RELEASED_ శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించిన జెఈవో

Tirupati, 23 January 2018: The annual brahmotsavams in the famous temple of Sri Kapileswara Swamy in Kapilateertham will be observed from February 6 to February 15 with ankurarpanam on February 5.

The ten-day religious festival takes place as per the tenets of Saivagama taking off with the ceremonial Dhwajarohanam in Kumba Lagnam at 8:30am on first day on February 6.

The TTD JEO Sri Pola Bhaskar released the Posters and pamphlets of the special annual religious fete at SV Vedic University in Tirupati on Tuesday evening. Temple DyEO Sri Subramanyam and AEO Sri Sankara Raju were also present.

The important days includes Moushika Vahanam on February 5 on the day of Ankurarpanam followed by Pallaki Utsavam,Hamsa Vahanam on February 6, Surya and Chandra Prabhas on February 7 Bhoota and Simha Vahanams on February 8, Makara and Sesha Vahanams on February 9, Adhikara Nandi and Tiruchi utsavams on February 10, Vyagra and Gaja vahanams on February 11, Kalpavriksha and Tiruchi on February 12, Rathotsavam and Nandi Vahanam of February 13, Purushamriga and Aswa vahanams with Kalyanotsavam on February 14, Nataraja Surya Prabha Vahanam, Trisula Snanam and Ravanasura vahanam with Dhwaja avarohanam on February 15.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించిన జెఈవో

తిరుపతి, 2018 జనవరి 23: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుంచి 15వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో గల సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీకపిలేశ్వరాలయ బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 5వ తేదీన అంకురార్పణ జరుగనుందని తెలిపారు. ఫిబ్రవరి 6న ధ్వజారోహణం, ఫిబ్రవరి 13న మహాశివరాత్రి సందర్భంగా నంది వాహనం, ఫిబ్రవరి 14న శివపార్వతుల కల్యాణం జరుగనున్నాయని తెలిపారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా జెఈవో కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీశంకరరాజు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

06-02-2018(మంగళవారం) ధ్వజారోహణం(కుంభలగ్నం) హంస వాహనం

07-02-2018(బుధవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

08-02-2018(గురువారం) భూత వాహనం సింహ వాహనం
09-02-2018(శుక్రవారం) మకర వాహనం శేష వాహనం

10-02-2018(శనివారం) అధికారనంది వాహనం తిరుచ్చి ఉత్సవం

11-02-2018(ఆదివారం) వ్యాఘ్ర వాహనం గజ వాహనం

12-02-2018(సోమవారం) కల్పవృక్ష వాహనం తిరుచ్చి ఉత్సవం

13-02-2018(మంగళవారం) రథోత్సవం(భోగితేరు) నందివాహనం

14-02-2018(బుధవారం) పురుషామృగవాహనం కల్యాణోత్సవం, అశ్వవాహనం

15-02-2018(గురువారం) శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,

సూర్యప్రభ వాహనం. ధ్వజావరోహణం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.