KOIL ALWAR TIRUMANJANAM AT SRI PAT_ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tiruchanoor, 23 January 2018: On the Occasion of the holy festival of Rathasapthami, Koil Alwar Thirumanjanam was held held at the Sri Padmavati Ammavari Temple on Tuesday. Koil Alwar Thirumanjanams are performed on four occasional annually on Rathasapthami, Vasantotsavams, Pavithrotsavams and Brahmotsavams.

As part of Koil Alwar Thirumanjanam the sanctum, vessels used for rituals are all cleaned with traditional herbs and detergents. In view of the holy event, the TTD has cancelled the Kalyanotsavams and Unjal seva for the day.

Spl Gr DyEO Sri Muniratnam Reddy and other officials participated in the event.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో బుధవారం రథసప్తమి పర్వదినం జరుగనున్న నేపథ్యంలో మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. రథసప్తమి, వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా మంగళవారం నాడు ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులోభాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజలసేవలను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

జనవరి 24న రథసప్తమి :

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా ఉదయం 7.00 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. అప్పటినుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై ఊరేగనున్నారు. సాయంత్రం 3.00 నుండి 4.00 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.30 గంటల వరకు చంద్రప్రభ, గజ వాహనాలను అధిష్టించి అమ్మవారు దర్శనమిస్తారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.