సెప్టెంబరు 21 నుండి 30వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

సెప్టెంబరు 21 నుండి 30వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

తిరుపతి, 2017 సెప్టెంబరు 09: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబరు 21 నుండి 30వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీకామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా సెప్టెంబరు 20న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం 6.00 గంటలకు టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, పురాణ ప్రవచనం, లలిత సహస్త్రనామ పారాయణము కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.