CVSO AND TIRUPATI URBAN SP INSPECT TIRUMALA_ తిరుమలలో సి.వి.ఎస్‌.ఓ – తిరుపతి అర్బన్‌ ఎస్‌.పి తణిఖీలు

Tirumala, 9 September 2017: In view of the ensuing annual Brahmotsavams at Tirumala which are scheduled from September 23 to October 1, the Chief Vigilance and Security Officer of TTD Sri A Ravikrishna along with Tirupati Urban SP Sri Abhishek Mohanaty inspected various places in Tirumala on Saturday to provide security for the upcoming mega religious fete.

The top cop duo inspected and verified the entry and exit points near all the important gates leading to galleries of four mada streets. They have also notified the points which need more attention in terms of security, keeping in view the past experiences.

They have visited Rambhageecha, Asthana Mandapam, Main Kalyanakatta, Annaprasadam complex and the entry and exit points to the galleries through the gates located in these areas and discussed elaborately on the measures need to be taken to avoid any untoward incident during annual fete.

ASP Sri Murali Krishna, VGO Sri Ravindra Reddy and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుమలలో సి.వి.ఎస్‌.ఓ – తిరుపతి అర్బన్‌ ఎస్‌.పి తణిఖీలు

సెప్టెంబర్‌ 09, తిరుమల 2017: ఈ నెల 23వ తేది నుండి ఆక్టోబరు 1వ తేది వరకు జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాల నేపథ్యంలో తి.తి.దే సి.వి.ఎస్‌.ఓ శ్రీ ఆకె. రవికృష్ణ, తిరుపతి అర్బన్‌ ఎస్‌.పి శ్రీ అబిషేక్‌ మహంతితో కలసి తిరుమలలోని వివిధ ప్రాంతాలలో శనివారంనాడు తణిఖీలు నిర్వహించారు.

ఇందులో భాగంగా రాంభగీచా, ఆస్థానమండపం, అన్నప్రసాదం, ప్రధాన కల్యాణకట్ట తదితర ప్రాంతాల నుండి నాలుగు మాడ వీధులలోని గ్యాలరీలకు వెళ్ళే ప్రవేశ-నిష్క్రమణ మార్గాలను వారు పరిశీలించారు. గత ఏడాది బ్రహ్మూెత్సవాల అనుభవం మేరకు సమస్యాత్మక ప్రాంతాలలో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో అందుకు సంబంధించిన సమాలోచనలు చేశారు.

ఈ తణిఖీలలో ఏ.ఎస్‌.పి శ్రీ మురళీకృష్ణ, వి.జి.ఓ శ్రీ రవీంద్రారెడ్డి కూడా ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.