KAREERISTI-VARUNAJAPA-PARJANYA SHANTI YAGAM COMMENCES _ ధర్మగిరిలో శాస్త్రోక్తంగా కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమాలు ప్రారంభం

Tirumala, 23 August 2023: The Kareeristi-Varunajapa-Parjanya Shanti Yagam commenced on a grand religious note in Dharmagiri Veda Vignana Peetham at Tirumala on Wednesday.

According to Principal Sri KSS Avadhani, the Yagams will be performed by 32 Ritwiks in the morning, noon and in the evening sessions in different spells.

Among them, a dozen Ritwiks perform Varunajapa and recite Parjanyashanti Mantras standing in the waters of Gogarbham dam.

Another 14 Ritwiks will recite the Shlokas from Ramayanam, Mahabharatam and Bhagavatam while remaining perform other rituals.

One of the chief priests of Tirumala temple Sri Venugopala Deekshitulu, faculty and students of Dharmagiri were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధర్మగిరిలో శాస్త్రోక్తంగా కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమాలు ప్రారంభం

తిరుమల, 2023 ఆగస్టు 23: రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాల‌ని, స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమాలు బుధవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో 32 మంది వేద‌, శ్రౌత‌, స్మార్థ‌పండితులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో యాగాలు, జపాలు, పారాయణాలు నిర్వహిస్తున్నారు. ఆరుగురు ఋత్వికులు కారీరిష్టి యాగం చేపడుతున్నారు. 12 మంది ఋత్వికులు గోగర్భం తీర్థంలో నడుము లోతు నీళ్లలో నిల్చుని వరుణ, పర్జన్య మంత్రాలను పఠించారు. అదేవిధంగా ఏడు వేద శాఖలకు చెందిన 14 మంది ఋత్వికులు రామాయణం, భాగవతం, మహాభారతంలోని విరాటపర్వం పారాయణం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.