TTD CHAIRMAN CONGRATULATES ISRO SCIENTISTS _ ఇస్రో శాస్త్రవేత్తలకు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి అభినందనలు

TIRUPATI, 23 AUGUST 2023: TTD Trust Board Chairman Sri Bhumana Karunakara Reddy on Wednesday congratulated ISRO scientists for their stupendous and historical success in Chandrayaan 3.

With the benign blessings of Sri Venkateswara Swamy, ISRO will make many such achievements in the future and make country proud among world nations, he asserted.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఇస్రో శాస్త్రవేత్తలకు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి అభినందనలు

తిరుపతి 23 ఆగస్టు 2023: చంద్రయాన్ 3 విజయానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి అభినందనలు తెలిపారు.

ప్రపంచం గర్వించే విజయానికి అహరహం కృషి చేసిన శాస్త్రవేత్తలకు
శ్రీ వేంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని ఆయన కోరారు.
చంద్రుడి దక్షిణ ధృవం పై అడుగు పెట్టిన తొలి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించడం పట్ల ఆయనహర్షం వ్యక్తం చేశారు.

ఇంతటి విజయాన్ని సాధించడం ఎంతో గర్వకారణమన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది