KARTHIKA DEEPOTSAVAM IN TIRUMALA ON DEC 3_ డిసెంబరు 3న శ్రీవారి ఆలయంలో కార్తీకపర్వ దీపోత్సవం

NO POURNAMI GARUDA SEVA

TIrumala, 13 November 2017: The holy hill shrine of Tirumala is set to glitter in the light of mud lamps on the auspicious occasion of annual Karthika Parva Deepotsavam on Sunday evening on December 3.

On this celestial occasion over 100 mud lamps are decorated at different places in Tirumala temple.

TTD has cancelled all the evening arjitha sevas and Pournami Garuda Seva in connection with this festival on December 3.
డిసెంబరు 3న శ్రీవారి ఆలయంలో కార్తీకపర్వ దీపోత్సవం

నవంబరు 13, తిరుమల, 2017: తిరుమల శ్రీవారి అలయంలో డిసెంబరు 3వ తేదీన కార్తీకపర్వ దీపోత్సవం ఘనంగా జరుగనుంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా ప్రతినెలా పౌర్ణమినాడు నిర్వహించే పౌర్ణమి గరుడసేవ ఈ కారణంగా రద్దయింది.

మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం పక్కన గల పరిమళ అర వద్ద 100 కొత్త మూకుళ్లలో నేతి వత్తులతో దీపాలను వెలిగిస్తారు. ఛత్రచామర, మంగళవాయిద్యాల నడుమ దీపాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేసి, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళామాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేర, తాళ్లపాకవారి అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద నేతిజ్యోతులను ఏర్పాటు చేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.