KARTHIKA ABHISHEKAM TO BEDI ANJANEYA SWAMY ON DECEMBER 10_ డిసెంబరు 10న శ్రీ బేడీ ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం

Tirumala, 5 December 2017: As the last sunday in the auspicious Karthika month is occurring on December 10, special Abhishekam will be performed to Sri Bedi Anjaneya Swamy in Tirumala on this sacred occasion. This celestial fete takes place between 9am and 10am. TTD officials participate in this special abhishekam.

The temple of Bedi Anjaneya Swamy is located exactly opposite to Srivari temple in Tirumala with the standing posture of Lord Anjaneya handcuffed. There is an interesting story behind this posture of Lord Hanuman. One day,during her stay on the Tirumala Hills, Anjana Devi, the mother of Hanuman prevented her beloved son who was wandering in search of his camel. Anjana Devi had tied both His hands with hand cuffs (Bedi) and ordered Him to stay right there until she returns. “Bala Hanuman,with all the respect for His mother, obediently followed her orders. But Anjana Devi did not come back.

Since them Bala Hanuman is standing waiting for his mother. Watching His beloved disciple standing all alone in front of His Temple, Lord Sri Venkateswara instructed His Temple priests in their dream to offer timely food to Bala Hanuman each and everyday and take good care of Him till his mother returns. It is for this reason that even today that the neivedyam prepared in Tirumala temple is also offered to Sri Bedi Anjaneya Swamy along with Varahaswamy everyday with out any deviation.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

డిసెంబరు 10న శ్రీ బేడీ ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం

డిసెంబరు 05, తిరుమల, 2017: తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా గల శ్రీ బేడీ ఆంజనేయస్వామివారి ఆలయంలో డిసెంబరు 10వ తేదీన ప్రత్యేక అభిషేకం జరుగనుంది. ప్రతి ఏడాదీ కార్తీక మాసం చివరి ఆదివారం ఇక్కడ స్వామివారికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం 9 నుంచి 10 గంటల నడుమ విశేషంగా అభిషేకం చేస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.

శరణాగత ప్రపత్తికి నిదర్శనం..

పురాణాల ప్రకారం తిరుమలలోని శ్రీ బేడీ ఆంజనేయస్వామివారి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అంజనీపుత్రుడైన ఆంజనేయుడు ఎంతో బలవంతుడు, అంతకుమించి పరమభక్తుడు. త్రేతాయుగంలో శ్రీరామావతారంలో శ్రీమన్నారాయణునికి సేవకుడిగా, స్నేహితుడిగా, భక్తుడికి దాస్యభక్తిని చాటాడు. ప్రస్తుతం కలియుగంలో సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో భక్తుల పూజలందుకుంటున్నాడు.

అంజనాదేవి తన కుమారుడైన ఆంజనేయుడిని శ్రీవారి ఆలయం ఎదురుగా నిలబెట్టి వెళ్లిందట. అయితే ఆంజనేయుడు అల్లరిగా తిరుగుతూ అడవిలో రభస చేస్తుండడంతో కాళ్లకు, చేతులకు బేడీలు తగిలించి వెళ్లి తిరిగి రాలేదట. అనంతరం అంజనాదేవి ఒక పర్వతంలో స్థిరపడి పశ్చాత్తాపపడడంతో ఆ పర్వతానికి అంజనాద్రి అనే పేరు వచ్చింది.

ఇదిలా ఉండగా తల్లి రాక కోసం శ్రీవారి ఆలయం ఎదుట ఒంటరిగా నిలిచున్న బాలాంజనేయుడిని శ్రీవేంకటేశ్వరస్వామివారు గమనించారట. ఆ బాలుని తల్లి వచ్చే వరకు వేళకు ఆహారం అందించి బాగా చూసుకోవాలని అర్చకులను ఆదేశించారట. ఈ కారణంగానే ప్రతిరోజూ శ్రీభూవరాహస్వామివారికి, శ్రీవేంకటేశ్వరస్వామివారికి సమర్పించే నైవేద్యాన్ని శ్రీ బేడీ ఆంజనేయస్వామి వారికి కూడా సమర్పిస్తారు. దీన్ని బట్టి తన భక్తుడైన హనుమంతుడికి శ్రీమన్నారాయణుడు ఇచ్చిన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.