KARTHIKA DEEPAM FESTIVAL ENHANCES DIVINE GLITTER TO SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం

Tirumala, 26 November 2023: Devotees had a divine sight of celestial ghee lit lamps on Sunday evening at Srivari temple under the carpet of dazzling diyas all around from Mahadwaram to Ananada Nilayam and outside temples.

With the shine of thousands of lamps, the Karthika Deepotsavam was observed by TTD with religious fervour.

TTD conducted the festival of lights, the annual Karthika Deepotsavam at Srivari temple after daily Kainkaryams and Nivedana on Sunday evening.

The bright ghee lamps were placed initially in 100 Mukullu, (mud pots)  everywhere between 6 pm to 8 pm by temple staff to mark the auspicious festival in the holy month of Karthika.

The Diyas were lighted at all locations inside the Srivari temple like sub temples, Bangaru vakili inside Vimana prakaram and mandapams, Vendi Vakili etc. inside the Sampangi prakaram besides the mahadwaram etc.  Bedi Anjaneya temple, Sri Varaha Swami temple and Sri Swami Pushkarani were also decorated with lights showcasing Tirumala as Bhooloka Vaikuntham.

Tirumala Sri Pedda Jeeyar Swamy, one of the chief priests Sri Venugopala Deekshitulu, TTD EO Sri AV Dharma Reddy, DLO Sri Veeraju, Temple DyEO Sri Lokanatham, VGO Sri Nanda Kishore and other officials were present.

In view of festival, TTD has cancelled the Sahara Deepalankara Seva at Srivari temple.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం
 
తిరుమల, 2023 నవంబరు 26: తిరుమల శ్రీవారి అలయంలో ఆదివారం రాత్రి కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తయిన తరువాత ఈ దీపోత్సవాన్ని కన్నుల  పండుగగా చేపట్టారు.
 
ఇందులో భాగంగా సాయంత్రం 5 గంటలకు దీపోత్సవం ప్రారంభమైంది.  మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళం అర దగ్గర 100 కొత్త మూకుళ్ళలో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత  గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేరా, తాళ్లపాక వారి అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా 100 నేతిజ్యోతులను మంగళవాయిద్యాల న‌డుమ‌ ఏర్పాటు చేశారు.
 
ఈ కార్తీక దీపోత్సవంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, డిఎల్వో శ్రీ వీర్రాజు, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, విజివో శ్రీ నందకిషోర్ ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.