KARTHIKA JWALA TORANAM HELD _ శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం

TIRUPATI, 26 NOVEMBER 2023: As a part of the auspicious Karthika Deepam, the ceremonious Jwala Toranam was observed with religious fervor in Sri Kapileswara Swamy temple in Tirupati on Sunday evening.

The Shiva Lingam and Thrishoolam arranged at Unjal Mandapam stood as a cynosure to devotees on the occasion.

Scores of devotees thronged and lit lamps everywhere in and around the temple premises.

DyEO Sri Devendra Babu, AEO Sri Subbaraju, Superintendent Sri Bhupati, archakas and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం

తిరుపతి, 2023 నవంబరు 26: తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరిగింది. 

సాయంత్రం గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్‌ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు.ఆ త‌రువాత‌ జ్వోలాతోరణం వెలిగించారు. 

ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.