KARTHIKA DEEPOTSAVAM CELEBRATED GRANDLY AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ భక్తిపారవశ్యంలో శ్రీ కపిలేశ్వరాలయ కృత్తికా దీపోత్సవం
Tirupati, November 24, 2026: The Karthika Deepotsavam was celebrated with religious fervour at Sri Kapileswara Temple in Tirupati on Tuesday evening on the occasion of Karthika Pournami.
A large number of women devotees lit thousands of lamps across the temple premises. Special lamps arranged in the shapes of a Shiva Lingam and Trident at the Unjal Mandapam were a major attraction. Deepa Aradhana was performed at the sanctum, temple towers, Dhwajasthambham and hilltop, followed by the lighting of Jwala Thoranam.
TTD JEO Dr A. Sharath, Temple Deputy EO Smt. Nag Ratna, Superintendent Sri Chandrasekhar, temple priests, officials and devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
భక్తిపారవశ్యంలో శ్రీ కపిలేశ్వరాలయ కృత్తికా దీపోత్సవం
తిరుపతి, 2026 నవంబరు 24: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం కృత్తికా దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా వేలాది దీపాల వెలుగులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని ప్రమిదలను వెలిగిస్తూ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.
ముందుగా సాయంత్రం 5.30 గంటలకు గర్భాలయంలో దీపారాధన నిర్వహించారు. అనంతరం శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభం, కొండపై దీపాలను వెలిగించారు. ఊంజల్ మండపంలో శివలింగం, త్రిశూలం ఆకృతుల్లో ఏర్పాటు చేసిన ప్రమిదలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు ఆలయ ప్రాంగణమంతా దీపాలను వెలిగించగా, అనంతరం జ్వాలాతోరణం వెలిగించారు.
కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కృత్తికా దీపోత్సవం శివభక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, భక్తిపారవశ్యాన్ని అందించింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఏ. శరత్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






