KARTHIKA DEEPOTSAVAM HELD AT KURNOOL _ క‌ర్నూలులో వేడుకగా కార్తీక దీపోత్సవం

 * ANUGRAHA BHASHANAM BY MATAJI OF SRI PEETHAM

 

* AP SP GROUNDS REVERBERATE WITH GOVINDA NAMA

 

Kurnool,27 November 2023: A massive congregation of devotees and a blessing address by Sri Shakti Peetham Mataji Sri Ramyananda Bharati were the highlight of the grand Karthika Deepotsavam celebrations organised by TTD at the APSP grounds of Kurnool town on  Monday evening under the personal supervision of TTD JEO for Health and Education Smt Sada Bhargavi.

 

Speaking on the occasion the Mataji said the unique festival organised by TTD is a hallmark of festivities in the holy month of Karthika.

 

Dr M Sampath Kumar  Sharma led the Veda pundits of SV Vedic University heralded the significance of the festival and also narrated the process of festivities.

 

Vedic pundits from SV Vedic University rendered Vishnu Sahasranama stotra Parayanams followed by Sri Mahalakshmi Puja.

 

The Ashtalakshmi Vaibhavam dance ballet by students and Govinda Nama by artists of Annamacharya project enthralled the devotees as the festivities concluded with Nakshatra Harati and Kumbha Harati.

 

Local MLA Sri Katasani Rambhupal Reddy, CEO SVBC Sri Shanmukh Kumar SE2 Sri Jagadeeshwar Reddy, Tirumala Dharmic projects program officer Srinivas K Rajagopal, one of the chief priests of Tirumala temple Sri Krishna Seshachala Deekshitulu, archakas, Veda pundits are large number of devotees were present.

 

Finally, all donors for the conduction of Karthika Deepotsavam were felicitated on the occasion and the program was live telecasted by SVBC for the sake of global devotees.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

క‌ర్నూలులో వేడుకగా కార్తీక దీపోత్సవం

– శ్రీ శక్తి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రమ్యానంద భారతి మాతాజీ అనుగ్రహ భాషణం

– గోవిందనామస్మరణతో మారుమోగిన ఎపిఎస్పీ మైదానం

– భారీగా హాజరైన భక్తులు

క‌ర్నూలు, 27 నవంబరు 2023: క‌ర్నూలులోని ఎపిఎస్పీ మైదానంలో సోమవారం రాత్రి కార్తీక మహాదీపోత్సవం అత్యంత వైభవంగా జ‌రిగింది. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన నిర్వహించారు.టీటీడీ జేఈఓ (వైద్య మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి స్వీయ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ శక్తి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రమ్యానంద భారతి మాతాజీ అనుగ్రహ భాషణం చేస్తూ కార్తీక మాసంలో భాగవదారాధన ఎంతో విశిష్టమైనదని, దీపారాధన ద్వారా భగవంతుని కొలిస్తే ఎంతో పుణ్యఫలమని చెప్పారు. సకల దేవతా స్వరూపమైన గురువు పూజిస్తే, దేవతలందరినీ పూజించిన ఫలితం దక్కుతుందన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానములు పవిత్రమైన కార్తీక మాసంలో దీపోత్సవాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీవారి కరుణా కటాక్షాలు కలగాలని ఆకాంక్షించారు.

కార్తీక మహాదీపోత్సవం ఇలా…

ముందుగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వేదపండితులు యతి వందనం చేశారు. పండితులు డా. ఎం.ప‌వ‌న్‌కుమార్ శ‌ర్మ‌ స్వాగతం, సందర్భ పరిచయం చేశారు. వేదస్వస్తి అనంతరం ఆయన దీప ప్రాశస్త్యాన్ని తెలియజేశారు.

అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారికి తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసర్చన నిర్వహించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పండితులు విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రదర్శించిన అష్ట‌ల‌క్ష్మీ వైభ‌వం నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది. ఆ త‌రువాత భక్తులతో దీప మంత్రం పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. ఈ సందర్బంగా భక్తులందరూ ఒక్కసారిగా చేసిన దీపారాధనతో మైదానం వెలుగుతో నిండిపోయింది. చివరగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.

టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూల్ రెడ్డి, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు, టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారి శ్రీ రాజగోపాల రావు, డిపిపి కార్యదర్శి శ్రీ సోమయాజులు, అర్చక బృందం, వేద పండితులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దీపోత్స‌వం నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించిన దాతలను జెఈవో సన్మానించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.