KARTHIKA DEEPOTSAVAM OBSERVED IN KAPILESWARA SWAMY TEMPLE IN TIRUPATI

Tirumala, 29 Nov. 20:On the occasion of Karthika Deepotsavam in the famous Shiva temple of Kapileswara Swamy in Tirupati, Jwala Thoranam was observed on Sunday evening with religious fervor.

The temple priests lit ghee lamps on Gopuram of Lord Kapileswara and Goddess Kamakshi Devi and on the hill.

This year as the water falls are still in full flow, the devotees are not avoided to enter in holy waters of the temple tank to lit lamps. In the unjal Mandapam lamps were lit in the form of Trishool and Lingam.

Temple DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం
 
తిరుపతి, 2020, న‌వంబ‌రు 29: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాయంలో ఆదివారం కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని  సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరిగింది. 
 
కార్తీక మాసంలో శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
 
ముందుగా, సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన కొండపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్‌ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు.ఆ త‌రువాత‌ జ్వోలాతోరణం వెలిగించారు. 
 
ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.