KARTHIKA MASA PUJOTSAVAMS _ న‌వంబ‌రు 23 నుండి వ‌సంత మండ‌పంలో కార్తీకమాస విష్ణుపూజ‌లు

TIRUMALA, 21 NOVEMBER 2023: The month-long Karthika Masa Pujotsavams will commence from November 23 onwards in Vasanta Mandapam at Tirumala.

SVBC will live telecast all programs for the sake of global devotees.

Vishnu Salagrama Puja will be observed on November 23 between 3pm and 4:30pm.

On November 24, Kaisika Dwadasi-Tulasi Damodara Puja between 3pm and 4:30pm, again on November 29 Gopuja between 8:30am and 10am, on December 10 Dhanwantari Jayanti between 3pm and 4:30pm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వంబ‌రు 23 నుండి వ‌సంత మండ‌పంలో కార్తీకమాస విష్ణుపూజ‌లు

తిరుమల‌, 2023 న‌వంబ‌రు 21: లోక‌క్షేమాన్ని కాంక్షిస్తూ ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ‌మ‌హావిష్ణువుకు సంబంధించిన పూజ‌లు వైఖాన‌సాగ‌మబ‌ద్ధంగా నిర్వ‌హించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ఈ పూజా కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు. ఈ కార్య‌క్ర‌మాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– న‌వంబ‌రు 23న గురువారం మ‌ధ్యాహ్నం 3 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు విష్ణుసాల‌గ్రామ పూజ‌.

– న‌వంబ‌రు 24న శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు కైశిక‌ద్వాద‌శి – శ్రీ తుల‌సీ దామోద‌ర పూజ‌.

– న‌వంబ‌రు 29న బుధ‌వారం ఉద‌యం 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు గోపూజ‌.

– డిసెంబ‌రు 10న ఆదివారం మ‌ధ్యాహ్నం 3 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు ధ‌న్వంత‌రి జ‌యంతి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.