KARTHIKA PARVA DEEPOTSAVAM IN TIRUMALA ON DEC 3_ డిసెంబరు 3న శ్రీవారి ఆలయంలో కార్తీకపర్వ దీపోత్సవం

Tirumala, 30 November 2017: The festival of lights, Karthika Parva Deepotsavam will be observed in Sri Tirumala temple on December 3.

The entire premises of temple will be lighted with ghee lit lamps in mud pots, giving entirely a different look to the hill shrine.

In view of this festival, TTD has cancelled Vasanthotsavam and Sahasra Deepalankara Sevas.

The mothly Pournami Garuda Seva is also cancelled by TTD following this festival.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

డిసెంబరు 3న శ్రీవారి ఆలయంలో కార్తీకపర్వ దీపోత్సవం

పౌర్ణమి గరుడసేవ రద్దు

నవంబరు 30, తిరుమల, 2017: తిరుమల శ్రీవారి అలయంలో డిసెంబరు 3వ తేదీన కార్తీకపర్వ దీపోత్సవం ఘనంగా జరుగనుంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా ప్రతినెలా పౌర్ణమినాడు నిర్వహించే పౌర్ణమి గరుడసేవ ఈ కారణంగా రద్దయింది.

మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం పక్కన గల పరిమళ అర వద్ద 100 కొత్త మూకుళ్లలో నేతి వత్తులతో దీపాలను వెలిగిస్తారు. ఛత్రచామర, మంగళవాయిద్యాల నడుమ దీపాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేసి, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళామాత, బంగారుబావి, కల్యాణమండపంతోపాటు సభేర, తాళ్లపాకవారి అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద నేతిజ్యోతులను ఏర్పాటు చేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.