KARTHIKA PARVA DEEPOTSAVAM OBSERVED _ తిరుమలలో ఘనంగా కార్తీక పర్వదీపోత్సవం
Tirumala, 29 Nov. 20: The hill shrine of Tirumala dazzled in the lights of ghee lit lamps on the occasion of Karthika Parva Deepotsavam on the auspicious day of Karthika Pournami on Sunday evening.
The entire temple premises starting from Main Entrance to Garbha Griham, Sub-Shrines etc. have been lit with a galaxy of ghee lit lamps.
The temple assumed a noval beauty in the brightness of ghee lit lamps. The specially designed traditional mud pot called “Mookullu” filled with desi ghee with a wick in the middle is lit with a twilight, which is carried in a procession initially by the Jiyangar Swamijis of Tirumala, TTD mandarins and other officials.
Later the entire temple premises is lit with the mud lamps giving the abode of Lord Venkateswara a Bhooloka Vaikuntha look.
Meanwhile, TTD has cancelled Vasanthotsavam and Sahasra Deepalankara Seva in connection with the Karthika Parva Deepotsavam.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో ఘనంగా కార్తీక పర్వదీపోత్సవం
తిరుమల, 2020 నవంబరు 29: తిరుమల శ్రీవారి అలయంలో ఆదివారం సాయంత్రం కార్తీక పర్వదీపోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక పౌర్ణమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నులపండుగగా నిర్వహించారు.
ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం పక్కనవున్న పరిమళం అర దగ్గర కొత్త మూకుళ్లలో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. ఆ తరువాత వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి మూలమూర్తికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేరా, తాళ్లపాకవారి అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద నేతిదీపాలను ఉంచారు.
ఈ సందర్భంగా టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాదీ తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమినాడు కార్తీకదీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను కార్తీక దీపాల జ్యోతులు హరించి వేయాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ కార్తీక దీపోత్సవం వెలుగుతో భక్తుల హృదయాలలో జ్ఞానజ్యోతులు వెలుగుతాయన్నారు.
ఈ కార్తీకదీపోత్సవంలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ అనంత, శ్రీమతి ప్రశాంతిరెడ్డి, శ్రీ మురళీకృష్ణ, శ్రీ కృష్ణమూర్తి వైద్యనాథన్, శ్రీ శేఖర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, అర్బన్ ఎస్పీ శ్రీ రమేష్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, విఎస్వో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ జగన్మోహనాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.