KARVETINAGARAM ANNUAL FEST FROM MAY 29 TO JUNE 6 _ మే 29 నుండి జూన్ 6వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
మే 29 నుండి జూన్ 6వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2024 మే 14: కార్వేటినగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 29 నుండి జూన్ 6వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 28వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. జూన్ 7వ తేదీన మధ్యాహ్నం 1.30 నుండి 3.30 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
29-05-2024
ఉదయం – ధ్వజారోహణం
సాయంత్రం – పెద్దశేష వాహనం
30-05-2024
ఉదయం – చిన్నశేష వాహనం
సాయంత్రం – హంస వాహనం
31-05-2024
ఉదయం – సింహ వాహనం
సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం
01-05-2024
ఉదయం – కల్పవృక్ష వాహన
సాయంత్రం – ఆర్జితకళ్యాణోత్సవం/ సర్వభూపాల వాహనం
02-05-2024
ఉదయం – మోహినీ అవతారం
సాయంత్రం – గరుడ వాహనం
03-05-2024
ఉదయం – హనుమంత వాహనం
సాయంత్రం – గజ వాహనం
04-05-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
సాయంత్రం – చంద్రప్రభ వాహనం
05-05-2024
ఉదయం – రథోత్సవం
సాయంత్రం – అశ్వవాహనం
06-05-2024
ఉదయం – చక్రస్నానం
సాయంత్రం – ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో జూన్ 1వ తేదీ సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.