DHWAJASTHAMBHA STHAPANA IN KARVETINAGARAM_ జూలై 1న కార్వేటినగరం శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ

Tirupati, 20 June 2018: The erection of new Dhwajasthambham in Sri Venugopala Swamy temple at Karvetinagaram will be observed on July 1.

Ankurarpanam for the fete will be observed on June 29 followed by Mahashanti Tirumanjanam on June 30.

Koil Alwar Tirumanjanam for annual brahmotsavams will be performed on June 26.
The annual brahmotsavams in this famous shrine will be observed from July 2 to 10.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 1న కార్వేటినగరం శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ

తిరుపతి, 2018 జూన్‌ 20: కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో జూలై 1వ తేదీన నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా జూన్‌ 29వ తేదీ సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు మృత్సంగ్రహణము, సేనాధిపతి తిరువీధి ఉత్సవం, అంకురార్పణ నిర్వహించనున్నారు. జూన్‌ 30వ తేదీన నూతన ధ్వజస్థంభ అధివాస త్రయం, స్వామి, అమ్మవార్త ఉత్సవర్తకు మహాశాంతి తిరుమంజనం నిర్వహిస్తారు.

జూలై 1న ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ

జూలై 1వ తేదీ ఆదివారం ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు సింహలగ్నంలో నూతన ధ్వజస్తంభమును శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించనున్నారు.

జూన్‌ 26న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో జూన్‌ 26వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో జూలై 2 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు నిర్వహిస్తారు. ఉదయం 7.30 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను మధ్యాహ్నం 12.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.