TIRUMALA JEO REVIEWS ON 2018 SRIVARI BRAHMOTSAVAMS_ ఆగస్టు ఆఖరునాటికి శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలి : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

TWIN FETE THIS YEAR

CHANGES IN THE TIMINGS OF VAHANA SEVAS

TRIAL RUN FOR GARUDA SEVA ON AUGUST 26 POURNAMI GARUDA SEVA

ALL ARRANGEMENTS IN PLACE BY AUGUST END

Tirumala, 19 June 2018: As two brahmotsavams are scheduled this year in Tirumala, JEO Sri KS Sreenivasa Raju reviewed on the arrangements to be made for the twin fete with all department heads.

The four hour long review meeting took place at Annamaiah Bhavan on Tuesday. Tirumala JEO discussed in detail with all the HoDs about the works to be taken up in view of brahmotsavams.

He instructed the engineering officials to complete all the works related to brahmotsavams by August 31.

Later he briefed the media persons about the preparatory measures and other important changes that were reviewed in the meeting. Some excerpts of JEO press conference:

* Two brahmotsavams in Tirumala this year.
Salakatla Brahmotsavams from September 13 to 21
Important days includes Dhwajarohanam on September 13, Garuda Seva on September 17, Swarnaratham on September 18, Rathotsavam on September 20, Chakrasnanam and Dhwajavarohanam on September 21.

* Honourable Chief Minister Sri N Chandrababu Naidu to present silk vastrams on behalf of State Government on September 13.

* Navarathri Brahmotsavams from October 10 to 18

Important days includes Garuda Seva on October 14, Swarna Ratham on October 17 and Chakrasnanam on October 18.

* Dhwajarohanam and Rathotsavam will be observed only during Salakatla Brahmotsavams.

* After consulting Agama Advisors, temple priests, Tirumala Jiyar Swami’s, the change of timings in vahana sevas will be implemented this year. Morning Vahana sevas will be observed between 9am and 11am, Evening Vahana sevas between 8pm and 10pm and Garuda Seva from 7pm onwards. The

* The pournami Garuda Seva which falls on August 26 will be viewed preparatory trial for all departments.

* All works with respect to civil, electrical, security etc will be completed by August 31.

* In view of Astabandhana Maha Samprokshana Balalayam which will be observed from August 12 to 16 with Ankurarpanam on August 11 in Tirumala temple, the Cleaning of Swamy Pushkarini is advanced by three weeks. (Instead of August 1 to 31, this year cleaning will be taken up from July 10 to August 10).

* Wide publicity on brahmotsavams through SVBC, other channels, print media, pamphlets, posters etc.will be taken up.

* All privilege darshans will be cancelled during the festival days as in previous years.

* No Break darshan even to protocol VIPs on Garuda Seva days during two brahmotsavams.

* Enhanced Annaprasadam, Laddu prasadam arrangements for the fete. As the second brahmotsavams will be coinciding with Puratsi month, extra care will be initiated in all departments.

* Cultural troupes from across the country to perform during brahmotsavams.

* Enhanced security arrangements in coordination between TTD vigilance and Police. Scouts and Guides, Srivari Sevakulu services to be utilized to man pilgrim crowd.

* Extension of galleries in North-East mada street, West mada street (opposite vasanta mandapam) and near old Ugranam is also being contemplated.

The Chief Priests of Tirumala temple, Sri Venugopala Dikshitulu, Sri Krishnaseshachala Dikshitulu, Sri Govindaraja Dikshitulu, OSD Sri P Seshadri, Bokkasam Incharge Sri Gururaja were also present.

Among the senior officers, CE Sri Chandrasekhar Reddy, FACAO Sri Balaji, CVSO Incharge Sri Siva Kumar Reddy, SEs Sri Ramachandra Reddy, sri Ramesh Reddy, Sri Venkateswarulu, temple DyEO Sri Harindranath and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు ఆఖరునాటికి శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలి : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

జూన్‌ 19, తిరుమల 2018: ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, ఆగస్టు నెలాఖరుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం నాడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశం అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ సాలకట్ల బ్రహ్మోత్సవాల తొలిరోజైన సెప్టెంబరు 13న ధ్వజారోహణం నాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌ|| ముఖ్యమంత్రివర్యులు పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా సెప్టెంబరు 17న గరుడవాహనం, సెప్టెంబరు 18న స్వర్ణరథం, సెప్టెంబరు 20న రథోత్సవం, సెప్టెంబరు 21న చక్రస్నానం, ధ్వజావరోహణం జరుగుతాయన్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా అక్టోబరు 14న గరుడవాహనం, అక్టోబరు 17న స్వర్ణరథం, అక్టోబరు 18న చక్రస్నానం జరుగుతాయని వివరించారు. ఉదయం వాహనసేవ 9 నుండి 11 గంటల వరకు, రాత్రి వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు జరుగుతుందని, గరుడవాహనసేవ రాత్రి 7 గంటల నుండి ప్రారంభమవుతుందని తెలియజేశారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, ఆగమ సలహామండలి సభ్యులు, ఆలయ ప్రధానార్చకులను సంప్రదించిన అనంతరమే రాత్రి వాహనసేవ సమయంలో మార్పు చేసినట్టు తెలిపారు.

ఆగస్టు 26న పౌర్ణమి గరుడసేవ నాడు అన్ని విభాగాలవారితో ప్రయోగాత్మక సమాయత్త బ్రహ్మోత్సవ గరుడసేవ నిర్వహిస్తామని, ఇందులో పోలీసు బందోబస్తు, లైటింగ్‌, ఎస్వీబీసి ప్రత్యక్ష ప్రసారాలు తదితర ఏర్పాట్లను పరిశీలిస్తామని జెఈవో తెలిపారు. బ్రహ్మోత్సవ వాహన తేదీలు, ఇతర సేవలు, ప్రత్యేక దర్శనాల రద్దు వివరాలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌, ఇతర ప్రసారమాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. ఇందుకోసం పోస్టర్లు, బుక్‌లెట్లు, ఫ్లెక్స్‌ బ్యానర్లు, ఆహ్వానపత్రికల(ఇన్విటేషన్స్‌)ను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. టిటిడి భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయం చేసుకుని భక్తులకు భద్రత కల్పిస్తామని, శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ద్వారా భక్తులకు సేవలందిస్తామని వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదం, లడ్డూప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య, దాససాహిత్య ప్రాజెక్టులు, వేద పాఠశాలలతో కలిపి ప్రత్యేక ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ సారి ఇతర రాష్ట్రాల కళాబృందాలు ఆకట్టుకుంటాయని తెలియజేశారు.

ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో బాలాలయం, అష్టబంధన మహాకుంభాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు బాలాలయం, అష్టబంధన మహాకుంభాభిషేకం జరుగనుందని, దీనికి ఆగస్టు 11న అంకురార్పణ నిర్వహిస్తామని జెఈవో తెలిపారు. శ్రీవారి పుష్కరిణి మరమ్మతులను జులై 10న ప్రారంభించి ఆగస్టు 10వ తేదీలోపు పూర్తిచేసి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేస్తామని చెప్పారు.

సమీక్ష సమావేశంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చ‌కులు శ్రీ వేణుగోపాలదీక్షితులు, శ్రీగోవిందరాజ దీక్షితులు, శ్రీ శ్రీకృష్ణశేషాచల దీక్షితులు, టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీఓ.బాలాజి, డిఎల్‌ఓ శ్రీ రమణనాయుడు, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇలు శ్రీరామచంద్రారెడ్డి, శ్రీరమేష్‌రెడ్డి, శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.