KAT AT APPALAYAGUNTA TEMPLE ON JUNE 11_ జూన్ 11న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 8 Jun. 19: The holy ritual of Koil Alwar Thirumanjanam will be performed at the Sri Prasanna Venkateswara Swamy Temple at Appalayagunta on June 11 as part of annual Brahmotsavams commencing from June 13.

The schedule of Brahmotsavam programs are as follows:

June 13-Dhwajarohanam, Pedda Sesha Vahanam,
June 17-Garuda Vahanam,
June 18- Hanumanta vahanam and Kalyanotsavam
June 20-Rathotsavam
June 21- Chakra Snanam.

Interested devotee couple could participate in the kalyanotsavam on payment of ₹500 per ticket and beget one uttarium, one blouse, one laddu,one appam and Anna Prasadams.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 11న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2019 జూన్ 08: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 11వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో జూన్ 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 8.00 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

13-06-2019(గురువారం) ధ్వజారోహణం(కర్కాటక లగ్నం) పెద్దశేష వాహనం

14-06-2019(శుక్రవారం) చిన్నశేష వాహనం హంస వాహనం

15-06-2019(శనివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

16-06-2019(ఆదివారం) కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

17-06-2019(సోమవారం) మోహినీ అవతారం గరుడ వాహనం

18-06-2019(మంగళవారం) హనుమంత వాహనం గజ వాహనం

19-06-2019(బుధవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

20-06-2019(గురువారం) రథోత్సవం అశ్వవాహనం

21-06-2019(శుక్రవారం) చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్‌ 16వ తేదీ సాయంత్రం 5.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.