KAVI SAMMELAN AT VONTIMITTA ON MARCH 30, 31 _ మార్చి 30, 31 వ తేదీల్లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కవి సమ్మేళనం

TIRUPATI, 29 MARCH 2023: In connection with Sri Rama Navami and Sri Potana Jayanti, Kavi Sammelan will be organised at Sri Kodanda Ramalayam in Vontimitta of YSR Kadapa District on March 30 and 31 under the aegis of the Dharma Prachara Parishad wing of TTD.

As part of this, on March 30, the Poetic Fete will be on “Potana Bhagavatam” and on March 31 on Sri Rama Paduka Pattabhishekam. This Literary Fiesta will be organised between 3pm and 5pm in the temple premises. The Vice Chancellor of  National Sanskrit University, Professor GSR Krishnamurthy will lead the Poetic fete on Potana Bhagavatam which includes stalwarts from Telugu literature Sri Narayana Reddy who delivers on Rukmini Sandesam, Dr B Gopala Krishna Shastry on Sri Rama Jananam, Dr K Sumana on Sita Rama Kalyanam, Sri P Shankar on Bhakti Rasam, Sri V Chinnayya on Kuchelopakhyanam, Sri M Lokanatham on Sharanagati Tatvam.

Similarly, on March 31, TTD Archaka Sikshana Co-ordinator Dr Hemanth Kumar will preside Sri Rama Pattabhishekam which includes the participation of scholars like Sri L Jagannatha Shastry on Sri Gadiyaram Vekatasesha Shastry’s Ramayanam, Sri Mallikharjuna Reddy on Sri Ramayana Kalpavriksham, Sri Y Madhusudhan on Sri Ranganatha Ramayanam, Sri Siva Reddy on Srimad Valmiki Ramayanam, Sri U Bharat Sharma on Champu Ramayanam, Dr P Neelaveni on Molla Ramayanam.

Everyday, starting from March 31 to April 8, there will be devotional cultural programmes in connection with Sri Rama Navami Brahmotsavams in Sri Kodanda Ramalayam at Vontimitta between 7pm and 9pm for the sake of the devotees by TTD.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 30, 31 వ తేదీల్లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కవి సమ్మేళనం

ఒంటిమిట్ట, 2023 మార్చి 29: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో మార్చి 30వ తేదీ పోతన భాగవతం అంశంపై కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.
మార్చి 31వ తేదీ శ్రీరామ పాదుకా పట్టాభిషేకం అంశంపై కవి సమ్మేళనం జరుగుతుంది.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జియస్ఆర్ కృష్ణమూర్తి అధ్యక్షతన “పోతన భాగవతం”పై ప్రముఖ పండితులు శ్రీ ఎం.నారాయణ రెడ్డి – రుక్మిణి సందేశం , డా.బి.గోపాలకృష్ణ శాస్త్రి – శ్రీరామ జననం, డా.కె.సుమన- సీతారామ కళ్యాణం, శ్రీ పి.శంకర్ – భక్తి రసం, శ్రీ వి.చిన్నయ్య – కుచేలోపాఖ్యానం, శ్రీ ఎం.లోకనాధం – శరణాగతి తత్వం అంశాలపై కవి సమ్మేళనం జరుగుతుంది.

అదేవిధంగా మార్చి 31వ తేదీ టీటీడీ అర్చక శిక్షణ కోఆర్డినేటర్ డా.హేమంత్ కుమార్ అధ్యక్షతన ”శ్రీరామ పాదుకా పట్టాభిషేకం” పై శ్రీ ఎల్.జగన్నాథ శాస్త్రి – గడియారం వెంకట శేషశాస్త్రి రామాయణం, శ్రీ ఎం.మల్లికార్జున రెడ్డి – శ్రీ రామాయణ కల్పవృక్షం,
శ్రీ వై. మధుసూదన్ – శ్రీ రంగనాథ రామాయణం, డా.సి.శివా రెడ్డి-శ్రీమద్ వాల్మీకి రామాయణం, శ్రీ యు.భరత్ శర్మ – చంపూ రామాయణం, డా. పి.నీలవేణి – మొల్ల రామాయణం అంశాలపై కవి సమ్మేళనం నిర్వహిస్తారు.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా మార్చి 31 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.