SRI RAMA NAVAMI AND PATTABHISHEKA ASTHANAMS IN TIRUMALA TEMPLE ON MARCH 30 AND 31 _ మార్చి 30న  శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం-మార్చి 31న శ్రీరామపట్టాభిషేకం

HANUMANTHA VAHANA SEVA ON MARCH 30

TIRUMALA, 29 MARCH 2023: In connection with the auspicious Sri Rama Navami and Sri Rama Pattabhishekam on March 30 and 31 respectively, TTD is conducting the Asthanams on these two days.

On the day of Sri Rama Navami on March 30, the utsava deities of Sri Sita, Lakshmana, Anjaneya Sameta Sri Rama will be seated at Ranganayakula Mandapam on a special platform and Snapana Tirumanjanam will be performed between 9am and 11am.

Later in the evening, Hanumantha Vahanam takes place between 6.30pm and 8pm followed by Sri Rama Navami Asthanam at Bangaru Vakili between 9pm and 10pm.

On March 31, Sri Rama Pattabhisheka Asthanam will be performed between 8pm and 9pm at Bangaru Vakili inside Tirumala temple.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 30న  శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం

మార్చి 31న శ్రీరామపట్టాభిషేకం

తిరుమల, 2023 మార్చి 29: తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30వ తేదీన గురువారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాముల‌వారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో మార్చి 31న శ్రీరామ పట్టాభిషేకం నిర్వ‌హిస్తారు.

శ్రీరామనవమి సందర్భంగా గురువారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు హ‌నుమంత వాహ‌నసేవ జ‌రుగుతుంది. ఆ త‌రువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కార‌ణంగా స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

మార్చి 31న శుక్రవారం సాయంత్రం 5 గంట‌ల‌కు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స‌హ‌స్ర‌దీపాలంకార సేవ జ‌రుగుతుంది. రాత్రి 8 నుండి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.