KEEP TIRUMALA CLEAN-TIRUMALA JEO _ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచండి – తిరుమల జె.ఇ.ఓ

Tirumala, Sep 2: Tirumala JEO Sri KS Sreenivasa Raju called upon the Sulabh workers to work with more enthusiasm and keep the premises of Tirumala clean, especially during annual brahmotsavams.

Addressing the huge gathering of Sulabh workers on Wednesday in Mullakunta he said, TTD won world wide acclaim for its clean maintenance of surroundings in spite of millions of people visiting the temple town every day.

“We even won the international award for cleanliness recently. It is all possible because of your efforts. Maintain the same in future also”, he added.

TTD Health officer Sri Venkatramana, Temple Deputy EO Sri C Ramana, health department officials were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER TIRUPATI
పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచండి – తిరుమల జె.ఇ.ఓ

తిరుమల, 02  అక్టోబరు 2013 : తిరుమలలో ప్రతి ఏటా నిర్వహించే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విచ్చేసే భక్తజన సందోహాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమల ఆలయ మరియు పరిసరప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు సులభ కార్మికులకు పిలుపునిచ్చారు.
 
బుధవారంనాడు తిరుమలలోని ముళ్లకుంట ప్రాంతంలో సులభ కార్మికులను బ్రహ్మోత్సవల సందర్భంగా ఉద్దేశించి తిరుమల జె.ఇ.ఓ మాట్లాడుతూ ఇప్పటికే పరిశుభ్రతకు మారుపేరుగా తిరుమల క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్నదన్నారు.  అంతర్జాతీయ పురస్కారాలు సైతం తి.తి.దేకు లభించాయన్నారు. అయినా తిరుమలలో ప్రతిరోజూ భక్తుల సందడితో నిత్యనూతనంగా ఉంటుంది కనుక పరిశుభ్రత విషయంలో నిరంతరాయంగా కృషిచేయాల్సి ఉంటుందన్నారు.
 
ప్రత్యేకించి బ్రహ్మోత్సవాలవంటి ప్రత్యేక దినాలలో రేయింబవళ్ళు ఎప్పటికప్పుడు సులభ కార్మికులు పారిశుద్ధ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తి.తి.దే ఆరోగ్యశాఖాధికారి శ్రీ వెంకటరమణ, ఆలయ డిప్యూటి.ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, ఇతర ఆరోగ్యశాఖ సిబ్బంది, దాదాపు 2000 మంది సులభ కార్మికులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.