KERALA EXPERTS TEAM VISITS GHAT ROADS _ ఘాట్‌ రోడ్లలో కొండచరియలను పరిశీలించిన కేరళ నిపుణుల బృందం

TIRUMALA, 05 DECEMBER 2021: The three member expert team from Amrita Viswa Vidyapeetham, Kerala visited the sites where the boulders have fallen in Tirumala ghat roads on Sunday.

The team comprising of Prof. Manisha, Prof. Nirmala Vasudevan, Prof. Sudesh Vadhawan along with the TTD Engineering and Forest officials thoroughly inspected the problematic sites on Ghat roads.

The experts team which is doing an international project on Strategic Initiatives Research and Innovation will give recommendations to TTD on how to arrest such rockfalls using advanced technology soon.

TTD DFO Sri Srinivasulu Reddy, EE Sri Surendranath Reddy, FRO Sri Venkata Subbaiah were also present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఘాట్‌ రోడ్లలో కొండచరియలను పరిశీలించిన కేరళ నిపుణుల బృందం

తిరుమల, 2021 డిసెంబ‌రు 05: ఇటీవల వర్షాలకు ఘాట్‌ రోడ్డులో విరిగిప‌డిన కొండచరియలను కేరళ కొల్లంలోని అమృత విశ్వ‌విద్యాల‌యం నుండి వరల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ల్యాండ్‌స్లైడ్ డిజాస్టర్ రిడక్షన్ కింద అంత‌ర్జాతీయ ప్రాజెక్ట్ చేస్తున్న నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది.

కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం వీరిని టిటిడి ఆహ్వానించింది.

ల్యాండ్‌స్లైడ్స్ నిపుణులు కొండ‌చ‌రియ‌లు విరిగిన ప్రాంతంలో పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు, భ‌విష్య‌త్తులో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా అత్యాధునిక శాస్త్రా ప‌రిజ్ఞానం ఉప‌యోగించుకొని స‌మ‌గ్ర స‌ర్వే నిర్వ‌హించి టీటీడీకి నివేదిక అందించనున్నారు.

ఈ కార్యక్రమంలో అమృత విశ్వవిద్యాలయం స్ట్రాటజిక్ ఇన్షియేటివ్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ విభాగానికి చెందిన నిపుణులు ప్రొఫెసర్ మనీషా, ప్రొఫెసర్ నిర్మల వాసుదేవన్, ప్రొఫెసర్ సుదేష్ విద్వాన్ , టీటీడీ డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, ఇఇ శ్రీ సురేంద్రనాథ్ రెడ్డి, ఎఫ్ఆర్ఓ శ్రీ వెంకటసుబ్బయ్య,
ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.