DON’T BELIEVE ON SOCIAL MEDIA POSTINGS REGARDING JOBS IN TTD _ టిటిడిలో ఉద్యోగాలంటూ సామాజిక మాధ్యమాల ప్రకటనలు నమ్మకండి : టిటిడి

TIRUPATI, 05 DECEMBER 2021: TTD had once again appealed not to believe in fake news on Social Media as well not to fell prey to middlemen regarding jobs in TTD.

In a statement released on Sunday, TTD has said that inspite of its repeated cautions on not to believe in such fake news, some people are getting cheated by some miscreants. TTD has also booked criminal cases against such malicious persons earlier.

TTD reiterated that whenever job recruitments takes place in TTD, it will release official notification to public in major newspapers and also in its official website. And one again appealed to public not to believe in social media fake postings on recruitments in TTD. And also warned that legal action will be initiated against such miscreants who are playing with the feelings of the public.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడిలో ఉద్యోగాలంటూ సామాజిక మాధ్యమాల ప్రకటనలు నమ్మకండి : టిటిడి

తిరుపతి, 2021 డిసెంబర్ 05: టిటిడిలో ఉద్యోగాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని చేస్తున్న అవాస్తవ ప్రకటనలను న‌మ్మి మోస‌పోవ‌ద్ధ‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది.

గతంలో టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది ద‌ళారులు మోసపు మాటలు చెప్పి కొంతమంది అమాయకుల నుండి డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది.

టిటిడిలో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ చేప‌ట్టేట‌ప్పు‌డు ముందుగా ప‌త్రిక‌ల్లో, టిటిడి వెబ్‌సైట్‌లో అధికారిక  ప్ర‌క‌ట‌న (నోటిఫికేషన్) ఇవ్వ‌డం జ‌రుగుతుంది. ఇలాంటి విషయాలపై టిటిడి గతంలో కూడా ప్రజలకు స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా  ఉండి అవాస్తవ ప్రకటనలు నమ్మవద్దని టిటిడి కోరుతోంది. ఇలాంటి అవాస్తవ ప్రచారం చేసేవారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.