KESAVA MURTHI BLESSES DEVOTEES ON SURYAPRABHA VAHANAM _ సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై కేశ‌వ‌మూర్తి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

Tirumala, 25 Sep. 20: On the seventh day of ongoing annual Brahmotsavams at Tirumala on Friday morning, Sri Malayappa Swami as Kesava Murthy blessed the devotees on Surya Prabha vahanam.

Legends says that, the Sun God, the key architect of life is dragged by seven horses with Anura as his charioteer. Sun God is symbolically represented for blessing with good health.

It is the common belief that the darshan of Surya Prabha Vahanam would provide long life to devotees and also provide relief to them them from all illnesses.

TTD Chairman Sri YV Subba Reddy, TTD EO Sri Anil Kumar Singhal, Board members Sri Ananta, Sri Siva Kumar, Sri Govind Hari, DP Anantha, Sri Sekhar Reddy, Dr Nischitha, Smt Prasanthi Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Srivari temple DyEO Sri Harindranath were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు  చ‌తుర్భు‌జాలు

సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై కేశ‌వ‌మూర్తి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

తిరుమ‌ల‌, 2020 సెప్టెంబరు 25: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శుక్ర‌‌‌వారం ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు  శంఖు, చక్రం, గ‌థ‌‌, అభ‌య‌హ‌స్తం ధ‌రించి చ‌తుర్భు‌జ కేశ‌వ‌మూర్తి అలంకారంలో దర్శనమిచ్చారు.

సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్య‌ప్రాప్తి

బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

రాత్రి 7 గంటలకు చంద్ర‌ప్ర‌భ ‌వాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు అనుగ్ర‌హిస్తారు.

వాహ‌న‌సేవ‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ‌మతి వేమిరెడ్డి ప్ర‌శాంతి, డా.నిశ్చిత‌, శ్రీ శివ‌కుమార్‌, శ్రీ శేఖ‌ర్ రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి అనంత‌, ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాథ్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.