SPECIAL FESTIVALS AT SRI KRT IN OCTOBER_ అక్టోబరులో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 4 October 2017: The TTD sub temple of Sri Kodandarama Temple at Tirupati will be bevy of several festivals in month of October with Abhisekhams on all Fridays, October 7, 14, 21 and 28. On the same days Bangaru Tiruchi and Unjal seva will also be performed in the evenings.

On October 5, Astothara Shata kalashabhisekham will be performed with Sri Sitarama Utsava Thiruchi procession upto Sri Ramachandra Pushkarini at 5.30pm in the evening and later Asthanam. Interested devotees could participate with payment of Rs 50.

On October 13 Sitaramamula Kalyanam in the morning besides Tiruchi procession up to Sri Ramachandra Pushkarini at 5.30pm in the evening and later Unjal seva in the evening. Interested devotees could particiapte with token payment of Rs.500.

On Ocobter 19, Amavasya Sahasra Kalashabhisekham will be performed along with Hanumantha seva in the evening. Interested devotees could participate with a token contribution of Rs.500.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబరులో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

అక్టోబరు 04, తిరుపతి, 2017: తిరుపతిలో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీకోదండరామాలయంలో అక్టోబరులో జరుగనున్న ఉత్సవాల వివరాలిలా ఉన్నాయి.

– అక్టోబరు 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం ఉదయం 6 గంటలకు మూలవర్లకు అభిషేకం, సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవర్లకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– అక్టోబరు 5న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- టికెట్‌ కొనుగోలుచేసి భక్తులు పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవర్లను తిరుచ్చిపై శ్రీ రామచంద్ర పుష్కరిణికి ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు అక్కడే ఆస్థానం చేపడతారు.

– అక్టోబరు 13న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి భక్తులు పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవర్లను తిరుచ్చిపై శ్రీ రామచంద్ర పుష్కరిణికి ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు అక్కడే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– అక్టోబరు 19న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి భక్తులు పాల్గొనవచ్చు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.