KODANDARAMA 35TH SPORTS MEET HELD _ ఘనంగా శ్రీ కోదండరామస్వామి ఆంగ్లోన్నత పాఠశాల 35వ వార్షికోత్సవం
TIRUPATI, 02 MARCH 2023: The 35th annual sports meet of Sr Kodandarama Swamy English Medium High School was observed with gaiety on Thursday.
TTD DEO Sri Bhaskar Reddy who graced the occasion wished the students Good Luck for their upcoming mains. Later he gave away prizes to winners.
Cultural programmes by the students allured the audience.
Other invitees, Head Master Sri Surendra Babu, Tirumala SV High School HM Sri Krishnamurty and others were present.
ఘనంగా శ్రీ కోదండరామస్వామి ఆంగ్లోన్నత పాఠశాల 35వ వార్షికోత్సవం
తిరుపతి, 27 ఫిబ్రవరి 2023: తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి ఆంగ్లోన్నత పాఠశాల 35వ వార్షికోత్సవం గురువారం ఘనంగా జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ డిఈవో శ్రీ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థులందరూ బాగా చదువుకుని రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. గత విద్యా సంవత్సరంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
ప్రధానోపాధ్యాయులు శ్రీ సురేంద్ర బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ బి.ఎస్.ఆర్ శర్మ, శ్రీ సుధాకర్, తిరుమల
ఎస్వీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కృష్ణమూర్తి, వెస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ శ్రీ ఓబయ్య, టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ చీర్ల కిరణ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.