SRI SITA RAMA ALANKARA KALYANAM HELD _ వసంత మండపంలో వైభవంగా శ్రీ సీతా రాముల అలంకార కల్యాణం

TIRUMALA, 02 MARCH 2023: Sri Sita Rama Alankara Kalyanam was held with spiritual ecstasy at Vasanta Mandapam in Tirumala on Thursday evening.

As the Sita Rama Kalyanam episode is to commence in Balakanda Parayanam soon, the celestial marriage was performed in this connection.

The event was telecasted live on SVBC between 6pm and 8pm for the sake of global devotees.

The deities of Sri Ramachandra Murty and Sri Sita Devi were brought and the celestial fete was observed jointly under the aegis of Dharmagri Veda Vignana Peetham and SVBC.

CEO SVBC Sri Shanmukh Kumar, Deputy EO Sri Ramesh Babu, devotees also participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వసంత మండపంలో వైభవంగా శ్రీ సీతా రాముల అలంకార కల్యాణం

తిరుమల, 02 మార్చి 2023: తిరుమలలోని వసంత మండపంలో గురువారం సాయంత్రం శ్రీ సీతా రాముల అలంకార కల్యాణం ఆధ్యాత్మిక పారవశ్యంతో జరిగింది.

త్వరలో బాలకాండ పారాయణంలో సీతా రామ కళ్యాణ ఘట్టం పారాయణ కార్యక్రమం ప్రారంభం కానున్నందున, ఈ క్రమంలోనే శ్రీ సీతారాముల కళ్యాణం ప్రవచన కార్యక్రమం నిర్వహించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్య ఈ కార్యక్రమం ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

ధర్మగ్రీ వేద విజ్ఞాన పీఠం, ఎస్‌విబిసి ఆధ్వర్యంలో శ్రీరామచంద్రమూర్తి, శ్రీ సీతాదేవి సమేత ఉత్సవమూర్తులను తీసుకొచ్చి కళ్యాణ ఘట్టాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్‌కుమార్, డిప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.