KODANDARAMA IN KALIAMARDHANA ALANKARAM _ కాళీయమర్దనాలంకారములో శ్రీకోదండరామస్వామి కటాక్షం
Vontimitta, 28 April 2021: Lord Kodandarama shined in Kaliamardana alankaram on the eighth day of the ongoing annual Sri Ramanavami Brahmotsavam of Vontimetta Sri Kodandaramaswami temple.
The divine Vahana Seva was held on Wednesday morning in ekantham in view of Covid guidelines.
Thereafter the majestic Snapana thirumanjanam was performed to the utsava idols of Sri Sita Lakshmana sameta Sri Kodandaramaswami followed by visesha abhisekam.
Temple AEO Sri Muralidhar, Superintendent Sri Venkateshaiah, inspectors Sri Dhananjayulu, Sri Giribabu, archakas and other staff were present.
CHAKRASNANAM ON APRIL 29:
On Thursday, April 29, TTD is organising a grand chakrasnanam in ekantham inside the temple in the morning and Dwajavarohanam at night after 07.30 pm heralding the successful conclusion of Sri Ramanavami Brahmotsavam.
PUSHPA YAGAM ON APRIL 30
On Friday, April 30, TTD is conducting a grand Pushpa yagam at Vontimetta temple to ward off all lapses by devotees or archakas, if any, that likely occurred during the annual Brahmotsavam events.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కాళీయమర్దనాలంకారములో శ్రీకోదండరామస్వామి కటాక్షం
ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 28: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవరోజు బుధవారం ఉదయం కాళీయమర్దనాలంకాములో స్వామివారు కటాక్షించారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహనసేవ నిర్వహించారు.
వాహనసేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేస్తారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ మురళీధర్, సూపరింటెండెంట్ శ్రీ వెంకటేశయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ధనంజయులు, శ్రీ గిరిబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 29న చక్రస్నానం
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు ఆలయంలో చక్రస్నానం నిర్వహించనున్నారు. రాత్రి 7.00 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ.
ఏప్రిల్ 30న పుష్పయాగం
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.