KOIL ALWAR TIRUMANJANAM IN TIRUMALA ON SEP 19_ సెప్టెంబరు 19న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala, 18 September 2017: The four times in a year unique event of Koil Alwar Thirumanjanam, will be performed in the Srivari temple tomorrow as part of the ensuring Srivari Brahmotsavam later this week. The event is performed ahead of Ugadi, Anivara Asthanam, Brahmotsavam and Vaikunta Ekadasii every year.

The Koil Alwar Thirumanjanam ritual will commence from 6AM to 11 AM tomorrow as part of which the sanctum, sub temples, potu, walls and even the slab, poja materials etc in the Srivari temple will be cleansed with natural herbs and desi detergents. They use Sri churnam, Kasturi pasupu, pachaku, sandal power, Gadda karporam, kumkumam and kichili gadds and another aromatic leaves etc.

In view of the holy ritual, the temple will be closed for darshan in the morning and will repoen for darshan from 12 noon in the afternoon and the scheduled Asta dalapada padmaradhana seva stands cancelled.

ISSUED BY PUBLIC RELATIONSOFFICER, TTDs, TIRUPATI

సెప్టెంబరు 19న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

సెప్టెంబర్‌ 18, తిరుమల, 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో సెప్టెంబరు 19వ తేదీన మంగళవారంనాడు శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయశుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుంది. ఇందులో గర్భాలయం, ఉప ఆలయాలు, పోటులోని గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. ఆ తరువాత నామకోపు, శ్రీచూర్ణణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర తిరుమంజనాన్ని ఆలయం అంతటా పూస్తారు. భక్తులను మధ్యాహ్నం 12.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని పురస్కరించుకుని అష్టదళ పాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.