PROVIDE QUALITY FACILITIES TO STUDENTS IN TTD INSTITUTIONS -TTD EO SRI ANIL KUMAR SINGHAL_ టిటిడి విద్యాసంస్థల్లోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు : ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 18 September 2017: TTD EO Sri Anil Kumar Singhal today exhorted officials to provide quality amenities to students in TTD educational institutions like SV Sravanam, SV Balamandir, School for SV Deaf and dumb.

The EO along with JEO Sri Pola Bhaskar, CVSO Sri Ake Ravi Krishna inspected the Sravanam Project office, SV Bala mandir complex and the SV deaf and dumb school complex on Monday evening.

Speaking on the occasion, Sri Singhal said all steps were taken to provide quality facilities to students in these institutions and all necessary arrangements would be made for quality education of challenged children. He said TTD employees were providing good service in all the institutions and urged them to more efforts for the sake of challenged students. All issues like drinking water, leakages staff shortfall, and others have all been noted by the management and effective steps will soon be taken for their redressal, he said.

During his visit he went round the Sravanam complex and interacted with small kids and parents on the facilities available and what more could be done.

EO said that the CVSO had recently adopted the SV Sravanam high school and SV deaf and dumb school and infused more quality measures in them. The TTD has commenced exercise to review the functioning of all temples and institutions in TTD care and all steps will be taken to improve all facilities in them

Among others TTD Chief Engineer Sri Chandrasekhar Reddy, Chief Medical officer Dr Nageswar Rao, Dy EO Smt Gautami, SE-1 Sri Ramesh Reddy, EE Sri Manoharam other officials and students participated.


ISSUED BY PUBLIC RELATIONSOFFICER, TTDs, TIRUPATI
టిటిడి విద్యాసంస్థల్లోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు : ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2017 సెప్టెంబరు 18: ఎస్వీ శ్రవణం, ఎస్వీ బాలమందిరం, ఎస్వీ శ్రవణోన్నత పాఠశాల, ఎస్వీ బదిర కళాశాలల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం ఎస్వీ శ్రవణం ప్రాజెక్ట్‌ కార్యాలయం, ఎస్వీ బాలమందిరం ప్రాంగణం, ఎస్వీ బదిర పాఠశాల ప్రాంగణాన్ని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణలతో కలిసి ఈవో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతుల కోసం చర్యలు చేపట్టామని, పిల్లల నాణ్యమైన చదువుకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. టిటిడిలోని పలు సంస్థలలో ఉద్యోగులు బాగా పనిచేస్తున్నారని, మరింత మెరుగ్గా పనిచేయాలని సూచించారు. ఆయా భవనాల మరమ్మతులు, తాగునీరు, భవనాల లీకేజీ, సిబ్బంది కొరత, సిబ్బంది సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని పరిష్కరిస్తామన్నారు. అవసరమైన చోట్ల పాత భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపడతామన్నారు.

ముందుగా శ్రవణం ప్రాజెక్ట్‌ ప్రాంగణానికి చేరుకున్న టిటిడి ఈవో చిన్న పిల్లలకు ఇస్తున్న శిక్షణ, పిల్లలు వినడం, పలకడం, రాయడం తదితర అంశాలను పరిశీలించారు. అక్కడ పిల్లలకు కల్పిస్తున్న వసతి, భోజనశాల, గ్రంథాలయం, తరగతి గదులు, శిక్షణకు అవసరమైన పరికరాలను పరిశీలించారు. అనంతరం బాలమందిరం చేరుకుని భవనమంతా కలియతిరిగి పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అటు తర్వాత ఎస్వీ శ్రవణోన్నత పాఠశాల, ఎస్వీ బదిర కళాశాలను పరిశీలించారు.

టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ ఎస్వీ శ్రవణోన్నత పాఠశాల, ఎస్వీ బదిర కళాశాలను ఇటీవల దత్తత తీసుకున్నారని, మరింత మెరుగైన సౌకర్యాల కోసం చర్యలు చేపట్టామని ఈవో తెలిపారు. విద్యార్థులు వేసిన చిత్రాలను చూసి ఈవో అభినందించారు. తిరుమలలో భక్తుల సౌకర్యాలు, టిటిడి ఆధీనంలోని వివిధ దేవాలయాల పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. టిటిడి విద్యాసంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయనే అంశాలను పరిశీలించడమేకాక, మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ముఖ్య వైద్యాధికారి డా|| నాగేశ్వరరావు, డిప్యూటి ఈవో శ్రీమతి గౌతమి, ఎస్‌ఈ-1 శ్రీ రమేష్‌రెడ్డి, ఈఈ శ్రీ మనోహరం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.