శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2017 అక్టోబరు 17: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో అక్టోబరు 19వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధద్రవ్యాన్ని గర్భాలయ గోడలకు పూశారు. అనంతరం ఉదయం 10.00 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి మునిలక్ష్మి, సూపరింటెండెంట్ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శేషారెడ్డి పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.