శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుపతి, 2017 అక్టోబరు 17: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు.

ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు యాగశాలలో నిర్వహించే పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ డి.ధనంజయులు, సూపరింటెండెంట్లు శ్రీ దినకరరాజ్‌, శ్రీ చంద్రశేఖర్‌బాబు, ఆలయ అర్చక బృందం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.