IMPOSING KOIL ALWAR AT SRI PADMAVATHI AMMAVARI TEMPLE _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tiruchanur, 24 April 2018: The holy ritual of Koil Alwar Thirumanjanam was performed in a grand manner at Sri Padmavati Ammavari Temple on Tuesday ahead of the annual Vasantotsavam from April 27th.

The temple premises comprising of pranganam, walls, roof slab, puja vessels and others of the temple were cleaned with traditional herbs like Sri Churnam, Namakopu, Kasturi, turmeric,Karpooram,Sandalpower,Kichligadda and perfumed waters.

The Vasantotsavam will kick start on April 27th with Ankurarpanam ,and Swarna Rathotsavam will beheld on April 29th Snapana Thirumanjanam will be performed at the Sri Padmavati Ammavari Temple for three days in the afternoon and the utsava deity of Sri Padmavati will be paraded on the mada streets in the late evenings .

Devotees interested in participating in the ritual could do so with a ticket of Rs.150/- per day and beget prasadam of one laddu and one vada .The TTD has cancelled all the arjita sevas like Kalyanotsavams, Unjal seva etc for the three days of Vasantotsavam.

Dy Eo (special grade) of Sri PAT, Sri Muniratnam Reddy AEO Sri Subramanyam, AVSO Sri Parthasarathi Reddy and Sri Guravayya and other officials participated in the event .


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఏప్రిల్‌ 24, తిరుపతి, 2018: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలలో భాగంగా అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

ఏప్రిల్‌ 27వ తేది అంకురార్పణంతో వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 29వ తేదీన ఉదయం స్వర్ణరథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ఈ సందర్భంగా ఈ మూడు రోజులపాటు సాయంత్రం 3 నుండి 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారిని ఘనంగా ఊరేగించనున్నారు.

గృహస్త భక్తులు ఒక్కొక్కరు రూ.150 చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. వసంతోత్సవం సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజలసేవను రద్దు చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో శ్రీ మునిరత్నం రెడ్డి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏవీఎస్‌వో శ్రీ పార్థసారథి రెడ్డి, శ్రీ గురవయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.