HARSHA TOYOTA DONATES VEHICLE TO TTD_ శ్రీవారికి కల్యాణరథం విరాళం
Tirumala, 24 April 2018: Sri Potti Sriramulu Nellore district based Harsha Toyota has donated Rs.60lakhs worth Kalyana Ratham to TTD on Tuesday.
Sri Harsha, the Chief of Harsha Toyota handed over the keys of the Kalyana Ratham to Tirumala JEO Sri KS Sreenivasa Raju.
Special pujas were performed to the vehicle in front of the Temple. Transport GM Sri Sesha Reddy, DI Sri Bhaskar Naidu were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI
శ్రీవారికి కల్యాణరథం విరాళం
ఏప్రిల్ 24, తిరుమల 2018: తిరుమల శ్రీవారికి మంగళవారం ఉదయం కల్యాణరథం విరాళంగా అందింది. నెల్లూరుకు చెందిన హర్ష టయోట అధినేత శ్రీ హర్ష సుమారు రూ.60 లక్షలు విలువైన ఈ వాహనాన్ని అందించారు.
శ్రీవారి ఆలయం ఎదుట కల్యాణరథం బస్సుకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. వాహనం తాళాలను టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుకు దాత అందించారు. శ్రీనివాస కల్యాణాల నిర్వహణ కోసం ఈ కల్యాణరథాన్ని వినియోగిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ట్రాన్స్‌పోర్టు జనరల్ మేనేజర్ శ్రీ శేషారెడ్డి, డిఐ శ్రీభాస్కరనాయుడు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.